The Guru " Great Dronacharya " - CV Nagraj, Cheif Coach, The School of power Tennis.
అపర ద్రోణుడు
సి.వి.నాగరాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోచ్ పేరు తెలియని టెన్నిస్ అభిమానులు ఉండరు! సుశీల్ నార్ల, పున్నా విశాల్, విష్ణువర్ధన్, సాకేత్ మైనేనిల రూపంలో నలుగురు డేవిస్ కప్ ఆటగాళ్లను అందించిన అపర ద్రోణుడు. బీపీఈడీ, ఎంపీఈడీ చదివి.. ఎన్‌ఐఎస్ శిక్షణ పూర్తి చేసిన నాగరాజు టెన్నిస్‌పై మక్కువతో 1991లో ఆర్‌ఆర్‌సీ మైదానంలో సొంతంగా అకాడమీని ఏర్పాటు చేశాడు. ఎలాంటి అత్యాధునిక వసతుల లేకున్నా.. సింథటిక్ కోర్టులు అందుబాటులో లేకపోయినా.. మట్టినే నమ్ముకున్న నాగరాజు అద్భుత ఫలితాల్ని రాబట్టాడు. క్లే కోర్టులపై నాణ్యమైన శిక్షణ ఇచ్చి.. దేశంలో మరే కోచ్‌కు సాధ్యంకాని రీతిలో నలుగురు డేవిస్ కప్ ఆటగాళ్లను అందించాడు. అరవై ఏళ్ళకు దగ్గరొస్తున్నా ఏ ఒక్కరోజు కూడా శిక్షణకు డుమ్మాకొట్టలేదు. పొద్దున 5 గంటలకే టెన్నిస్ కోర్టులో ప్రత్యక్షమవుతాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా టెన్నిస్‌పై ఇష్టంతో దేశానికి ఆణిముత్యాల్ని అందిస్తున్నాడు.
No comments:
Post a Comment